రంగారెడ్డి జిల్లా: యువకునిపై సర్పంచ్ దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-04-07T17:36:57+05:30 IST

మొయినాబాద్ మండలం శ్రీరాంనగర్‌లో మల్లేష్ గౌడ్ అనే యువకుడిపై గ్రామ సర్పంచ్ ప్రభాకరరెడ్డి దాడికి పాల్పడ్డాడు.

రంగారెడ్డి జిల్లా: యువకునిపై సర్పంచ్ దౌర్జన్యం

రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ మండలం శ్రీరాంనగర్‌లో మల్లేష్ గౌడ్ అనే యువకుడిపై గ్రామ సర్పంచ్ ప్రభాకరరెడ్డి దాడికి పాల్పడ్డాడు. రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌లో స్థానిక ఎంపీటీసీ ఫోటో పెట్టి తన ఫోటో పెట్టనందుకు విచక్షణా రహితంగా కొట్టాడు. ఊిరి చివర పొలంవద్ద ఉన్న మల్లెష్ గౌడ్‌ను ఊరిలో ఉన్న గ్రామ పంచాయతీ వరకు కొట్టుకొంటూ వచ్చాడు. గ్రామ సర్పంచ్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను సమరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం మాని దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలని తాను గతంలో నిలదీయడంతో అది మనసులో పెట్టుకుని ప్లెక్సీ వివాదాన్ని సాకుగా చూపి సర్పంచ్ తనపై దాడి చేశాడని  మల్లేష్ గౌడ్ ఆరోపించాడు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు.


Read more