మహిళను కడుపులో తన్నిన సర్పంచ్
ABN , First Publish Date - 2020-03-08T11:15:52+05:30 IST
గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. ప్రజలు ఎన్నుకున్న ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలి. అయితే కామారెడ్డి జిల్లాలో ఓ

కామారెడ్డి జిల్లాలో దారుణం
పెద్దకొడ్‌పగల్, మార్చి 7: గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. ప్రజలు ఎన్నుకున్న ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలి. అయితే కామారెడ్డి జిల్లాలో ఓ పెద్దమనిషి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఓ వీధి గొడవలో సంయమనం కోల్పోయి మహిళను కాలితో తన్నాడు. పెద్దకొడ్‌పగల్ మండలంలో అంజనీ గ్రామ పంచాయతీ రోడ్డు పక్కన సాయాగౌడ్‌కు చెందిన సాగు భూమిలో ఓ షట్టర్ ఉంది. ఈ షట్టర్ విషయంలో సర్పంచ్ పండరి, సాయాగౌడ్ మధ్య కొంత కాలంగా వివాదం నెలకొంది. శనివారం రాత్రి తన సాగు భూమిలోని షట్టర్‌లో సాయాగౌడ్ ఉండగా.. సర్పంచ్ పండరి అటు వైపు వెళ్లారు.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సాయాగౌడ్ కుమారుడు దత్తు, సర్పంచ్ పండరిలు ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నారు. తమ కుమారుడితో గొడవ ఎందుకు పడుతున్నావని.. మధ్యలో వచ్చిన దత్తు తల్లి రుక్మిణిని సర్పంచ్ పండరి కడుపులో తన్నడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.