ఉపాధి హామీ పనులకు సర్పంచ్
ABN , First Publish Date - 2020-05-13T08:34:58+05:30 IST
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డబ్బు చెల్లింపు విషయంలో కూలీలకు భరోసా కల్పించేందుకు రంగారెడ్డి

షాద్‌నగర్ రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డబ్బు చెల్లింపు విషయంలో కూలీలకు భరోసా కల్పించేందుకు రంగారెడ్డి జిల్లాలోని ఓ సర్పంచ్ కూడా పనులు చేస్తున్నారు. ఈ పనులు చేస్తే సకాలంలో కూలి డబ్బు ఇవ్వరని కూలీలు ముందుకు రాలేదు. దాంతో కాశిరెడ్డిగూడ సర్పంచ్ దీనా శంకర్ ఉపాధి కూలీగా మారారు. సర్పంచ్ కూడా పనిలోకి దిగడంతో 80 మంది కూలీలు వస్తున్నారు. చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించుకోవడానికి కృషి చేస్తున్నట్లు దీనా శంకర్ తెలిపారు.