సంతోష్ సతీమణి సంతోషికి నచ్చిన శాఖలో ఉద్యోగం: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-22T23:29:57+05:30 IST

సంతోష్ సతీమణి సంతోషికి నచ్చిన శాఖలో ఉద్యోగమిస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో కోరడంతో 711 గజాల స్థలం ఇచ్చామని తెలిపారు.

సంతోష్ సతీమణి సంతోషికి నచ్చిన శాఖలో ఉద్యోగం: జగదీష్‌రెడ్డి

సూర్యాపేట: సంతోష్ సతీమణి సంతోషికి నచ్చిన శాఖలో ఉద్యోగమిస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో కోరడంతో 711 గజాల స్థలం ఇచ్చామని తెలిపారు. సంతోష్ బాబు కాంస్యవిగ్రహం కూడా ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కోర్టు జంక్షన్‌లో ఏర్పాటు చేసి అక్కడ కల్నాల్ సంతోష్ మార్గ్‌గా నామకరణం చేస్తామని, దేశం కోసం ప్రాణాలర్పించిన వారందరికీ అండగా ఉంటామని జగదీష్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - 2020-06-22T23:29:57+05:30 IST