సంతోష్‌బాబుకు 2 నెలల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అయినా..
ABN , First Publish Date - 2020-06-18T17:07:30+05:30 IST
కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకున్న సంతోష్ బాబు తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరారు.
సూర్యాపేట: కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకున్న సంతోష్ బాబు తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరారు. చిన్న వయసులో కల్నల్ స్థాయి వరకు ఎదిగారు. లడ్డాఖ్‌లో విధులు నిర్వహించారు. రెండు నెలల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అయినా లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి చైనా దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు భారత సైనికులతో గొడవకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించేందుకు సంతోష్ బాబు ప్రయత్నించారు. ఓ వైపు మాట్లాడుతుండగానే సంతోష్ బాబుపై చైనా జవాన్లు దాడికి దిగారు. దీంతో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
కాగా కల్నల్ సంతోష్‌బాబు స్వస్థలం సూర్యాపేట కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. పట్టణంలోని వ్యాపారులు, స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. అంతుకుముందు సంతోష్‌బాబు ఇంటివద్ద ఆయన పార్ధివదేహానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సంతోష్ బాబు అమర్ రహే అంటూ అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర వెంబడి రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి వీర సైనికుడికి నివాళలర్పిస్తున్నారు. పూల వర్షం కురిపిస్తున్నారు. సంతోష్ కుమార్ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.