సంతోష్‌బాబు ప్రాణ త్యాగం వృధా కాదు: ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2020-06-18T20:20:23+05:30 IST

దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన ప్రాణ త్యాగం వృధా కాదని...

సంతోష్‌బాబు ప్రాణ త్యాగం వృధా కాదు: ఎంపీ అరవింద్

సూర్యాపేట: దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు చేసిన ప్రాణ త్యాగం వృధా కాదని, చిరస్థాయిగా నిలిచిపోతుందని బీజీపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని సంతోష్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంతోష్ చనిపోవడం బాధగా ఉన్నా తమ కుమారుడు దేశం కోసం వీరమరణం పొందాడని గర్వపడుతున్నారని అన్నారు. అలాంటి తల్లిదండ్రులకు పాదాభివందనాలని చెప్పారు. సంతోష్ తెలంగాణలో యువతకు స్ఫూర్తిగా నిలస్తారని భావిస్తున్నట్లు అరవింద్ చెప్పారు.

Updated Date - 2020-06-18T20:20:23+05:30 IST