సంతోష్‌బాబు జీవితం యువతకు ఆదర్శం
ABN , First Publish Date - 2020-06-18T09:21:21+05:30 IST
సంతోష్‌బాబు జీవితం యువతకు ఆదర్శం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్
- ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరుపెట్టాలి
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- సంతాప లేఖ పంపిన సోనియాగాంధీ
సూర్యాపేట, జూన్ 17(ఆంధ్రజ్యోతి): సంతోష్‌బాబు జీవితం యువతకు ఆదర్శం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్‌బాబు తల్లిదండ్రులను బుధవారం ఆయన పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఏదైనా ప్రాజెక్టుకు కానీ, వీలైతే సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంతోష్‌బాబు పేరు పెడితే ఆయన కీర్తి ఎప్పటికీ ప్రజల్లో గుర్తుంటుందని ప్రభుత్వానికి సూచించా రు. దేశరక్షణ, సమగ్రత, సమైక్యత కోసం పోరాడి వీరమరణం పొందాడన్నారు.
సంతోష్‌బాబు మర ణం ఒకవైపు బాధ కలిగిస్తున్నా; దేశం కోసం ప్రా ణాలర్పించడం గొప్ప విషయమన్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనేది సంతోష్‌బాబు తండ్రి కోరిక అని, అది నెరవేరకపోవడంతో కొడుకును సైన్యంలోకి పంపి కోరిక తీర్చుకున్నారని తెలిపారు. దేశరక్షణ లో అమరుడైన సంతోష్‌బాబు తెలంగాణతో పాటు సూర్యాపేట ప్రాం తానికి గొప్ప పేరు తెచ్చిపెట్టాడని కొనియాడారు. సంతోష్‌బాబు కుటుంబా న్ని పార్టీపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామ ని హామీ ఇచ్చారు. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతోష్‌బాబు తల్లిదండ్రులను పరామర్శించారు. కాగా, కల్నల్ సంతోష్‌బాబు మృతికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఓ లేఖలో సంతాపం ప్రకటించారు. ఆ లేఖను సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ఉత్తమ్ అందజేశారు. సంతోష్‌బాబు అమరత్వం, త్యాగం, దేశభక్తి, ధైర్యం చిరస్మరణీయమని లేఖలో సోనియా పేర్కొన్నారు.
రూ.2కోట్ల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలి: కోమటిరెడ్డి
వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవా రం విలేకరులతో ఆయన మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట ముద్దు బిడ్డ మృతి చెందడం బాధాకరమన్నారు. సంతోష్‌బాబు భార్యకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.