సంతోష్‌బాబు కాంస్య విగ్రహం: మంత్రి జగదీష్ రెడ్డి

ABN , First Publish Date - 2020-06-23T17:45:39+05:30 IST

కల్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట కోర్టు సెంటర్‌లో ఏర్పాటు చేసి..

సంతోష్‌బాబు కాంస్య విగ్రహం: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: కల్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట కోర్టు సెంటర్‌లో ఏర్పాటు చేసి.. అక్కడ రోడ్డుకు కల్నల్ సంతోష్ బాబు మార్గ్‌గా పేరు పెడతామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. సంతోష్‌బాబు సతీమణి సంతోషికి నచ్చిన శాఖలో ఉద్యోగం ఇస్తామన్నారు. సంతోష్ బాబు పేరు చిరస్మరణీయగా ఉండేలా సైనిక స్కూలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు.

Read more