ప్రశాంతతను భగ్నం చేస్తున్న సంజయ్:
ABN , First Publish Date - 2020-11-26T08:22:15+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా, హైదరాబాద్‌లోని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేేసలా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర

తమ్మినేని
పాతబస్తీ దేశంలో భాగం కాదా?: పొన్నాల
హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా, హైదరాబాద్‌లోని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేేసలా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్ర మంత్రులతోపాటు వివిధ రాష్ట్రాల ఎంపీలతో బీజేపీ ప్రచారం చేయించడంతోపాటు విద్వేషపూరిత ప్రకటనలు చేయిస్తోందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశమివ్వండని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరుతున్నారని.. కానీ ఇప్పటికే వరుసగా కేంద్రంలో రెండుసార్లు అవకాశం కల్పిేస్త దేశాన్ని ఆర్థికంగా అధోగతి పాల్జేశారని ఎద్దేవా చేశారు.
పాత బస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని బండి సంజయ్ అంటున్నారని, పాతబస్తీ దేశంలో భాగం కాదా? అని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ బీజేపీ నెరవర్చలేదన్నారు. నగరంలో రక్తపాతం సృష్టించి ఓట్లు రాబట్టుకోవాలని బండి సంజయ్ చూస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆరోపించారు. అసద్, అక్బర్‌లు ముస్లింలకు న్యాయం చేయలేదన్నారు. దుబ్బాకలో గెలిచినంత మాత్రాన బీజేపీ పొంగిపోవద్దని, తాము చేసిన చిన్న తప్పిదాల వల్లనే తమ పార్టీకి నష్టం వాటిల్లిందని చెప్పారు.