పురుడు పోసిన పారిశుధ్య సిబ్బంది

ABN , First Publish Date - 2020-04-25T08:33:15+05:30 IST

కరోనా కట్టడిలో ముందుండి పనులు చేస్తున్న పారిశుధ్య సిబ్బంది శుక్రవారం గద్వాల పట్టణంలో ఓ యాచకురాలికి పురుడు పోసి మానవతను చాటుకున్నారు.

పురుడు పోసిన పారిశుధ్య సిబ్బంది

గద్వాలలో నడిరోడ్డుపై మగ బిడ్డకు జన్మనిచ్చిన యాచకురాలు


గద్వాల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో ముందుండి పనులు చేస్తున్న పారిశుధ్య సిబ్బంది శుక్రవారం గద్వాల పట్టణంలో ఓ యాచకురాలికి పురుడు పోసి మానవతను చాటుకున్నారు. స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద సంస్థానాదీశుల కాలం నాటి పెద్ద ఫిరంగి ఉంది. ఈ ఫిరంగి కింద 10 రోజులుగా మారమ్మ అనే మహిళ (గర్భిణి) ఉంటోంది. ఆమె భర్త అభి.. వారం క్రితం కర్నూల్‌ వెళ్లి తిరిగి రాలేదు. మారమ్మకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అక్కడే ఉన్న పారిశుధ్య సిబ్బంది అంజనమ్మ, రైతమ్మ గమనించి పురుడు పోశారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.  వైద్య సిబ్బంది తల్లీ బిడ్డలను గద్వాల ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.  


Updated Date - 2020-04-25T08:33:15+05:30 IST