సంగారెడ్డి కలెక్టర్‌ ఆదర్శం

ABN , First Publish Date - 2020-03-27T11:35:04+05:30 IST

కరోనా నియంత్రణలో ప్రజలకు ఆదర్శంగా నిలవడం కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం వివిధ సమావేశాల్లో కలెక్టర్‌, అధికారులు సామాజిక దూరం పాటిస్తూ కూర్చున్నారు. దీంతో పాటు జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు

సంగారెడ్డి కలెక్టర్‌ ఆదర్శం

సామాజిక దూరాన్ని పాటిస్తూ సమావేశాలు..

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు

సంగారెడ్డి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో ప్రజలకు ఆదర్శంగా నిలవడం కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం వివిధ సమావేశాల్లో కలెక్టర్‌, అధికారులు సామాజిక దూరం పాటిస్తూ కూర్చున్నారు. దీంతో పాటు జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్కెట్లలో మీటరు దూరం చొప్పున డబ్బాలు గీసి, వాటిలోనే ప్రజలు నిల్చుని ఒకరి తర్వాత ఒకరు కూరగాయలు కొనుక్కునేలా చర్యలు తీసుకున్నారు. ఇదే విధంగా కిరాణాషాపులు, మెడికల్‌ షాపుల వద్ద కూడా డబ్బాలు గీయించారు. నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ పట్టణాల్లో కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులను మూసి వేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - 2020-03-27T11:35:04+05:30 IST