సంగారెడ్డిలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-06-23T01:21:02+05:30 IST

సంగారెడ్డిలో కరోనా విజృంభణ

సంగారెడ్డిలో కరోనా విజృంభణ

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజు 11 కరోనా కేసులు వెలుగు చూశాయి. బీడీఎల్ భానూర్‌లోని ఓ టౌన్ షిప్‌లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే పటాన్‌చెరులో ఒకరు కరోనా బారిన పడ్డారు. బీహెచ్ఈఎల్ న్యూ ఎమ్ఐజీలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-06-23T01:21:02+05:30 IST