సంగారెడ్డిలో కొత్తగా 17 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-07-19T02:40:03+05:30 IST

సంగారెడ్డిలో కొత్తగా 17 కరోనా కేసులు నమోదు

సంగారెడ్డిలో కొత్తగా 17 కరోనా కేసులు నమోదు

సంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు 17 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా వల్ల ఈ రోజు ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డిలో 1, జహీరాబాద్ లో 5, బిరంగుడాలో 2, ఆర్సీపురంలో3, పిచారగడిలో1, సదాశివపేటలో1, జోగిపేటలో 1, పటన్ చేరులో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆర్సీపురం లో ర్యాపిడ్ టెస్టులు 50 చేశారని, అందులో 9 పాజిటివ్ వచ్చాయని వైద్య అధికారులు 


చెప్పారు.


Updated Date - 2020-07-19T02:40:03+05:30 IST