ఇంధన శాఖ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌

ABN , First Publish Date - 2020-08-01T07:47:39+05:30 IST

ఇంధన శాఖ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌

ఇంధన శాఖ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌

ఇంధన శాఖ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు  ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. సందీప్‌ కుమార్‌సుల్తానియా ప్రస్తుతం పంచాయతీరాజ్‌ కార్యదర్శిగా ఉన్నారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్‌ మిశ్రా శుక్రవారం పదవీ విరమణ చేశారు. విద్యుత్‌ సౌధలో ఉద్యోగులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.


పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌గా అనితా రాజేంద్ర

రాష్ట్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రకు పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.  వెటర్నరీ, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా, తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్‌ లక్ష్మారెడ్డి  శుక్రవారం  పదవీ విరమణ చేశారు.

Updated Date - 2020-08-01T07:47:39+05:30 IST