పోలీస్‌స్టేషన్‌లో ఇసుక పంచాయితీ
ABN , First Publish Date - 2020-03-13T10:48:36+05:30 IST
సుక పంచాయితీ పోలీ్‌సస్టేషన్‌కు చేరి, స్టేషన్ ఆవరణలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగిన ఘటన నారాయణపేటలో గురువారం జరిగింది. నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామ శివారులో

నారాయణపేట క్రైం, మార్చి 12 : ఇసుక పంచాయితీ పోలీ్‌సస్టేషన్‌కు చేరి, స్టేషన్ ఆవరణలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగిన ఘటన నారాయణపేటలో గురువారం జరిగింది. నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామ శివారులో ఈ నెల 10న టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మికంగా దాడులు చేసి భారీగా ఇసుక అక్రమ నిల్వలతో పాటు ఓ ఇసుక రవాణా ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ఈ ఘటనలో సురే్‌షరెడ్డి అనే వ్యక్తిపై ఇదివరకే కేసు నమోదైంది. తమపై ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించారని ఆరోపణతో గ్రామంలోని రెండు వర్గాలకు చెందిన వారి మధ్య గురువారం మాటామాట పెరిగి భౌతికదాడులకు పాల్పడ్డారు. అనంతరం రెండు వర్గాల వారు నారాయణపేట పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో సురే్‌షరెడ్డి, కార్తీక్, మహేష్ తనపై దాడి చేశారంటూ వెంకటేష్ ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలని వెంకటేష్ వర్గీయులు పోలీ్‌సస్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు పోలీసుల ఎదుటే బాహాబాహీకి దిగారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. వెంకటేష్ ఫిర్యాదు మేరకు సురే్‌షరెడ్డి, కార్తిక్, మహే్‌షలపై కేసును నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. కార్తీక్ కూడా ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.