ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2020-11-15T21:16:22+05:30 IST

డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇసుకాసురులకు వరంగా మారింది. అభివృద్ధి పనులకు..

ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా

మహబూబాబాద్ జిల్లా: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇసుకాసురులకు వరంగా మారింది. అభివృద్ధి పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తోడేసి సొమ్ముచేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా, ఆకేరువాగు ఇసుక దందా వైపు అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మహబూబాబాద్ జిల్లా, నర్సింహులుపేట మండలం, జయపురం శివారులోని ఆకేరువాగు పరివాహక ప్రాంతం నుంచి ఇసుక యదేచ్ఛగా తరలిపోతోంది. ఇక్కడ ఇసుక తరలింపునకు అనధికారికంగా వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పాటలో రూ. 8 లక్షల 50 వేలకు దక్కించుకున్న వ్యాపారి.. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్ ఇసుకకు రూ. 4వందలు వసూలు చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను దర్జాగా తరలిస్తున్నారు.

Updated Date - 2020-11-15T21:16:22+05:30 IST