శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు... 8 కిలోల బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2020-10-05T02:56:14+05:30 IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ కార్గో నుంచి తరలిస్తున్న రూ.6.62 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు...  8 కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాద్: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ కార్గో నుంచి తరలిస్తున్న రూ.6.62 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్‌ నుంచి ముంబై తరలించే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో  విమానాశ్రయ కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ శివకృష్ణ అనుమానించి తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ బంగారం ఎవరు పంపారనే విషయాలపై అధికారులు కూపీ లాగుతున్నారు. 

Updated Date - 2020-10-05T02:56:14+05:30 IST