ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి: సంపత్

ABN , First Publish Date - 2020-05-11T21:56:33+05:30 IST

హైదరాబాద్: వ్యవసాయరంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అఖిలపక్ష నేత సంపత్ కుమార్ పేర్కొన్నారు.

ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి: సంపత్

హైదరాబాద్: వ్యవసాయరంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అఖిలపక్ష నేత సంపత్ కుమార్ పేర్కొన్నారు. నేడు పంటలు వేస్తేనే రైతుబంధు ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. జీవో 3పై సరైన వాదనలు విన్పించకపోవడం వల్లే సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. రెండు ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌ తెచ్చి గిరిజనుల హక్కులు కాపాడాలని సంపత్ కోరారు.

Updated Date - 2020-05-11T21:56:33+05:30 IST