గాంధీ వైద్యులకు సలాం

ABN , First Publish Date - 2020-04-05T11:18:58+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది కరోనా బాధితులు శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరంతా...

గాంధీ వైద్యులకు సలాం

  • కోలుకున్న 15 మంది కరోనా బాధితుల డిశ్చార్జి


అడ్డగుట్ట/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది కరోనా బాధితులు శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వీరంతా.. వారం రోజులు ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందారు. గాంధీ వైద్యులు తమకు మంచిగా చికిత్స చేసి త్వరగా నయమయ్యేలా చేశారంటూ ప్రశంసించారు. కాగా.. ఇంటికి వెళ్లాక కూడా కనీసం 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని, తాము చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటించాలని, మందులు వాడాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ కుమార్‌ వారికి సూచించారు. 15 మంది బాధితులకు నయమవడం ఆనందం కలిగించిందని ఆయన అన్నారు.

Updated Date - 2020-04-05T11:18:58+05:30 IST