అధిక ధరలకు మాస్కుల విక్రయం
ABN , First Publish Date - 2020-03-24T09:30:30+05:30 IST
పెద్దపల్లి పట్టణంలోని ఓ మెడికల్ షాపులో మాస్కులను అధిక ధరకు విక్రయిస్తుండటంతో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆ షాపు యజమానికి సోమవారం రూ.25 వేల జరిమానా

రూ. 25 వేల జరిమానా
పెద్దపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణంలోని ఓ మెడికల్ షాపులో మాస్కులను అధిక ధరకు విక్రయిస్తుండటంతో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆ షాపు యజమానికి సోమవారం రూ.25 వేల జరిమానా విధించారు. స్థానిక పెద్దపల్లి మందుల దుకాణంలో మాస్కులను 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు ఓ వినియోగదారుడు లీగల్ మెట్రాలజీ అధికారికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.