ఆటో, క్యాబ్‌లను తిప్పొద్దు.. లేకుంటే క్రిమినల్ కేసులు పెడతాం: సీపీ

ABN , First Publish Date - 2020-03-23T21:56:26+05:30 IST

ఆటో, క్యాబ్‌లను తిప్పొద్దని, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఓలా, ఉబెర్‌ సర్వీసులు కూడా ఆపేయాలని ఆదేశించారు. అనుమతించిన వాహనాల్లోనూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సూచించారు.

ఆటో, క్యాబ్‌లను తిప్పొద్దు.. లేకుంటే క్రిమినల్ కేసులు పెడతాం: సీపీ

హైదరాబాద్: ఆటో, క్యాబ్‌లను తిప్పొద్దని, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఓలా, ఉబెర్‌ సర్వీసులు కూడా ఆపేయాలని ఆదేశించారు. అనుమతించిన వాహనాల్లోనూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సూచించారు. ఆంబులెన్స్‌లను ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. హోమ్ క్వారంటైన్‌ నుంచి బయటికి వస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మానిటరింగ్‌ కోసం టీమ్‌లను పెంచుతామని, ప్రజలు లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. రాత్రి 7 గంటలకు అన్ని షాపులు మూసేయాలని ఆయన ఆదేశించారు. అనవసరంగా వాహనాలతో రోడ్డెక్కితే ఫైన్ వేస్తామని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సజ్జనార్ హితవుపలికారు. 

Updated Date - 2020-03-23T21:56:26+05:30 IST