మాస్కు లేకుండా బయటకు రావొద్దు: సజ్జనార్
ABN , First Publish Date - 2020-06-18T10:00:32+05:30 IST
మాస్కు లేకుండా బయటకు రావొద్దు: సజ్జనార్
హైదరాబాద్ సిటీ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోన్న వేళ దాని కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. కరోనా విషయంలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కు లేకుండా ఎవరూ బయటకు రావొద్దన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని సూచించారు. అనివార్య కారణాలతో ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించింది, కాబట్టి భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కానీ చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ నిబంధనలను పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వా రిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిఽధిలో లాక్‌డౌన్ సడలించిన నాటి నుంచి ఇప్పటి వరకు 2,376 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.