ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం.. వైద్యం వికటించి వృద్ధుడు మృతి

ABN , First Publish Date - 2020-06-22T19:16:25+05:30 IST

ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యానికి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఆపరేషన్ పేరుతో డాక్టర్లు నిండు ప్రాణాలు తీశారు.

ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం.. వైద్యం వికటించి వృద్ధుడు మృతి

రంగారెడ్డి: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యానికి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఆపరేషన్ పేరుతో డాక్టర్లు నిండు ప్రాణాలు తీశారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్‌లో అత్తాపూర్‌లో ఉన్న సాయి సూర్య హాస్పిటల్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్‌తో ముత్యాలు అనే వృద్ధుడు ఆదివారం రాత్రి చేరాడు. అతనికి చిన్న చికిత్స అవసరమన్న డాక్టర్లు.. పూర్తిస్థాయి వైద్యం అందించకుండానే వెళ్లిపోయారు. చివరికి వారి వైద్యం వికటించి వృద్ధుడు చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆసుపత్రి సిబ్బంది కూడా పరారయ్యారు. వైద్యులు అందుబాటులో లేకపోవడం, వెంటిలేటర్ కూడా లేకపోవడంపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఈ మేరకు ఆసుపత్రిపై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.    


Updated Date - 2020-06-22T19:16:25+05:30 IST