దీక్షిత్‌ హత్య కేసులో సాగర్‌కు 31 వరకు కస్టడీ

ABN , First Publish Date - 2020-10-28T07:11:47+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌, హత్య కేసులో నిందితుడు మంద

దీక్షిత్‌ హత్య కేసులో సాగర్‌కు 31 వరకు కస్టడీ

మహబూబాబాద్‌ క్రైం, అక్టోబరు 27: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌, హత్య కేసులో నిందితుడు మంద సాగర్‌ను తదుపరి విచారణ నిమిత్తం మంగళవారం పోలీసులు తమ కస్టడికి తీసుకున్నారు. ఈ నెల 18న మహబూబాబాద్‌ కృష్ణకాలనీ నుంచి దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసి, హత్య చేసిన సాగర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే.

సాగర్‌ను కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోర్టును కోరారు. దీంతో ఈ నెల 27 నుంచి 31 వరకు సాగర్‌ ను కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సబ్‌ జైల్‌ నుంచి రిమాండ్‌ ఖైదీ సాగర్‌ను  పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు.   


Updated Date - 2020-10-28T07:11:47+05:30 IST