‘రూర్బన్‌’కు అంకురార్పణ

ABN , First Publish Date - 2020-12-20T05:02:11+05:30 IST

పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దే ‘రూర్బన్‌’ పథకం ఎట్టకేలకు పట్టాలెక్కింది. పథకానికి పరిపాలనాపరమైన అన్ని అనుమతులు రావడంతో పనులు చేయడానికిగాను ప్రభుత్వం సిద్ధమైంది. పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులు చేయడానికిగాను అనువైన స్థలాలను ఎంపికచేస్తోంది.

‘రూర్బన్‌’కు అంకురార్పణ

అభివృద్ధి పనులకు స్థలాల ఎంపిక
రూ.30 కోట్ల పనులకు ప్రతిపాదనలు


పర్వతగిరి, డిసెంబరు 19 : పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దే ‘రూర్బన్‌’ పథకం ఎట్టకేలకు పట్టాలెక్కింది. పథకానికి పరిపాలనాపరమైన అన్ని అనుమతులు రావడంతో పనులు చేయడానికిగాను ప్రభుత్వం సిద్ధమైంది. పర్వతగిరి మండలంలో పలు అభివృద్ధి పనులు చేయడానికిగాను అనువైన స్థలాలను ఎంపికచేస్తోంది. మండలవ్యాప్తంగా ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వస్థలాలతో పాటు అన్యాక్రాంతమైన ప్రభుత్వస్థలాల వివరాలను వెలికితీస్తోంది. ప్రభుత్వస్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుని పలు నిర్మాణాలకు కేటాయిస్తోంది. తొలివిడతలో భాగంగా రూ.30 కోట్ల పనులను చేపట్టడానికి గాను అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందించారు. రూర్బన్‌ పథకంలో భాగంగా పర్వతగిరి మండలంలో పనులను చేపట్టడానికి గాను పలు భవనాలు, కార్యాలయాలు నిర్మించాల్సి ఉంది. దీనికి గాను మండలవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. దీంతో పాటు అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాలను సైతం వెలికితీసి తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ఆయా స్థలాల్లో భవనాలను నిర్మించడానికి గాను ప్రతిపాదనలు రూపొందించారు. తొలివిడతలో వివిధ శాఖల ఆధ్వర్యంలో రూ.30 కోట్లతో పనులను చేపట్టడానికి గాను ప్రభుత్వానికి సమగ్ర నివేదిక(డీపీఆర్‌)లను అందించారు.

 • రూ.30 కోట్ల పనులకు ప్రతిపాదనలు
  మండల కేంద్రంలో సాలిడ్‌ అండ్‌ లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద రూ.10 లక్షలతో మోడ్రన్‌ డంపింగ్‌యార్డు నిర్మాణం చేపట్టనున్నారు.
  స్కిల్‌ డెవల్‌పమెంట్‌లో భాగంగా మండలకేంద్రంలో రూ.2.20కోట్లతో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను నిర్మించనున్నారు.
  కల్లెడలో రూ.7లక్షలతో జూట్‌ బ్యాగ్‌ తయారీ కేంద్రం
  అన్నారంలో రూ.5లక్షలతో అగరుబత్తి తయారీ కేంద్రం
  అన్నారం, తూర్పుతండా, చౌటపెల్లి గ్రామాల్లో రూ.10.75లక్షలతో పేపర్‌ ప్లేట్ల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
  అగ్రి సర్వీసెస్‌ ప్రాసెసింగ్‌లో భాగంగా చౌటపెల్లి, ఏనుగల్లు, పర్వతగిరి గ్రామాల్లో రూ.82.75 లక్షల చొప్పున రూ.2.48 కోట్లతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు వెచ్చించనున్నారు.
  కూరగాయలతోటలకు గాను ఒక్కొక్కరికి రూ.3.5లక్షల చొప్పున చింతనెక్కొండలో (28 మందికి) రూ.98 లక్షలు, ఏనుగల్లులో (14మందికి) రూ.49లక్షలు, గోపనపెల్లిలో (11మందికి) రూ.39లక్షలు, కొంకపాకలో (7 మందికి) రూ.24లక్షల చొప్పున వెచ్చించనున్నారు.
  కల్లెడ గ్రామంలో బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌కు రూ.68 లక్షలు
  కొంకపాక, ఏనుగల్లులో పశువైద్య సబ్‌సెంటర్లకు రూ.34 లక్షలు
  పర్వతగిరిలో విలేజ్‌హాట్‌కు రూ.47లక్షలు
  దాల్‌ మిల్లుకు రూ.10లక్షలు
  కొంకపాకలో మిల్లెట్స్‌ డీ హస్కింగ్‌ మిషిన్లకు రూ.50 లక్షలు
  ఏనుగల్లులో 2వేల మెట్రిక్‌టన్నుల సామర్ధ్యంతో పాటు డ్రైయింగ్‌ ఫ్లాట్‌పామ్‌లతో కూడిన గోదాము నిర్మాణానికి రూ.2.15 కోట్లు
  కొంకపాకలో 3వేల మెట్రిక్‌టన్నుల సామర్ధ్యంతో పాటు డ్రైయింగ్‌ ఫ్లాట్‌పామ్‌లతో కూడిన గోదాము నిర్మాణానికి రూ.2.60 కోట్లు కేటాయించారు.
  టూరిజం డెవల్‌పమెంట్‌లో బాగంగా అన్నారం షరీఫ్‌ దర్గా చెరువు అభివృద్ధికి రూ.1.50 కోట్లు
  బండ్‌ బ్యూటిఫికేషన్‌కుగాను రూ.1.10 కోట్లు కేటాయించారు.
  తూర్పుతండాలోని సవారికుంటకు రూ.38లక్షలు
  పర్వతగిరిలోని పోలుకమ్మ చెరువుకు రూ.28లక్షలు
  టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.50 లక్షలు
  పర్వతగిరిలో ఐదు షాపులు, లైబ్రరీ, నాలెడ్జ్‌ సెంటర్‌తో మాల్‌ నిర్మాణానికి రూ.60లక్షలు
  అన్నారంలో 13 షాపులతో మాల్‌ నిర్మాణానికి రూ.1.45 కోట్లు కేటాయించారు.
  మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా పర్వతగిరిలో ఆపరేషన్‌ థియేటర్‌, వార్డుల నిర్మాణానికి రూ.35 లక్షలు
  కల్లెడ, రోళ్లకల్లు, అన్నారం, ఏనుగల్లు, చౌటపెల్లి, తూర్పుత ండా, దౌలత్‌నగర్‌, చింతనెక్కొండ గ్రామాల్లో హెల్త్‌సబ్‌సెంటర్ల నిర్మాణానికి గాను రూ.1.44కోట్లు వెచ్చించనున్నారు.
  ఎడ్యుకేషన్‌లో బాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో పాఠశాల గదుల నిర్మాణం, స్మార్ట్‌క్లా్‌సరూమ్‌ల నిర్మాణం, సైన్స్‌ల్యాబ్‌ల నిర్మాణం, ఎక్వి్‌పమెంట్‌, టాయిలెట్‌ బ్లాక్స్‌, డ్రింకింగ్‌ వాటర్‌ సౌకర్యం కోసం రూ.2.78 కోట్లు కేటాయించారు.
  సోషల్‌ వెల్ఫేర్‌లో భాగంగా ఆయా గ్రామాల్లో మోడల్‌ అంగన్‌వాడీ బిల్డింగ్‌ల నిర్మాణానికి రూ.68లక్షలు, స్పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా పర్వతగిరిలో 2.50 కోట్లతో మినీస్టేడియం, మల్టీ జిమ్‌ నిర్మాణం
  చింతనెక్కొండ, కొంకపాక, ఏనుగల్లు, అన్నారం, అనంతారం, చౌటపెల్లి గ్రామాల్లో ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు రూ.33 లక్షలు వెచ్చించనున్నారు.
  సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌లో భాగంగా ఆయా గ్రామాల్లో రూ.19లక్షలతో ఈ పంచాయతీ ఎక్వి్‌పమెంట్‌ను కొనుగోలు చేయనున్నారు.

Read more