రుద్రమదేవి మరణ శాసనాలు మూడు!
ABN , First Publish Date - 2020-05-10T09:56:49+05:30 IST
కాకతీయ మహారాణి రుద్రమదేవికి సంబంధించి మూడు మరణ శాసనాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా చందుపట్లలోని సోమనాథ....
హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): కాకతీయ మహారాణి రుద్రమదేవికి సంబంధించి మూడు మరణ శాసనాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా చందుపట్లలోని సోమనాఽథ దేవరకు మల్లికార్జుననాయని బంధువు పుపుల ముమ్మడి క్రీ.శ. 1289 నవంబరు 25నాడుచేసిన భూదాన శాసనం రుద్రమదేవి మరణాన్ని తెలిపే ఒక ఆధారంగా వారు పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా ఈపూరులోని గోపాలస్వామి గుడి ముందరి స్తంభం మీద క్రీ.శ. 1289 నవంబరు 28న శాసనాన్ని కూడా మరో ఆధారంగా పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా పాటిగడ్డ(పుట్టాల)లోని ఓ శాసనం ప్రకారం క్రీ.శ. 1289 డిసెంబరు 17న వేసిన శాసనం కూడా ఇంకో ఆధారంగా చెబుతున్నారు.