ఆర్టీసీ సంస్థను తిరిగి గాడిన పెట్టేదాక నిద్రపోను: కేసీఆర్
ABN , First Publish Date - 2020-11-15T23:36:53+05:30 IST
ఆర్టీసీ సంస్థను తిరిగి గాడిన పెట్టేదాక నిద్రపోననని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుతామని తెలిపారు.

హైదరాబాద్: ఆర్టీసీ సంస్థను తిరిగి గాడిన పెట్టేదాక నిద్రపోననని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుతామని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీకి ఆర్ధికంగా అండగా నిలుస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్‌శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందని ఆయన గుర్తుచేశారు. వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలరైజ్ చేసిందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ వస్తోందని కేసీఆర్ దుయ్యబట్టారు.
కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని తిరిగి వారికి చెల్లించాలని నిర్ణయించిన కేసీఆర్ అందుకోసం దాదాపు రూ. 120 నుంచి రూ. 130 కోట్లను విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను కేసీఆర్ అభినందించారు. అలాగే హైదరాబాద్‌లో సోమవారం నుంచి 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్‌ను మఖ్యమంత్రి ఆదేశించారు.