భార్యతో గొడవ.. విద్యుత్ స్తంభం ఎక్కిన కండక్టర్

ABN , First Publish Date - 2020-07-10T20:36:03+05:30 IST

జల్లాలోని హుస్నాబాద్‌లో గల నెహ్రూ మసీదు వద్ద ఓ ఆర్టీసీ కండక్టర్ హల్ చల్ చేశాడు. తాగిన మైకంలో విద్యుత్ స్తంభం ఎక్కి రభస సృష్టించాడు. వివరాల్లోకెళితే.. ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న

భార్యతో గొడవ.. విద్యుత్ స్తంభం ఎక్కిన కండక్టర్

సిద్దిపేట: జల్లాలోని హుస్నాబాద్‌లో గల నెహ్రూ మసీదు వద్ద ఓ ఆర్టీసీ కండక్టర్ హల్ చల్ చేశాడు. తాగిన మైకంలో విద్యుత్ స్తంభం ఎక్కి రభస సృష్టించాడు. వివరాల్లోకెళితే.. ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాలు.. తన భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆ క్రమంలో ఫుల్లుగా తాగి విద్యుత్ స్తంభం ఎక్కి రచ్చ రచ్చ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుకు నచ్చజెప్పాడు. బాలు స్తంభం దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బాలుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-07-10T20:36:03+05:30 IST