సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2020-10-04T09:39:01+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని

సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు ఆర్టీసీ బస్సులు

హన్మకొండ అర్బన్‌, అక్టోబర్‌ 3: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని వరంగల్‌ ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ అంచూరి శ్రీధర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి మొత్తం 50 ప్రత్యేక బస్సు సర్వీసులతో పాటు కాజీపేట, వరంగల్‌ నగరాల్లో 25 బస్సులను నడుపుతున్నామన్నారు. అభ్యర్థుల సౌకర్యం కోసం కాజీపేట, వరంగల్‌ బస్టాండ్లలో మార్గనిర్దేశం కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సౌకర్యాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


నగరంలో నేడు 144 సెక్షన్‌ అమలు

వరంగల్‌ అర్బన్‌ క్రైం: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఆదివారం నిర్వహించనున్న పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నట్టు వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ పి.ప్రమోద్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో బుక్‌స్టాల్స్‌, జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని, తెరిచిన షాపుల యజమానులపై జరిమానా విధించాలని పోలీసు అధికారులకు సీపీ సూచించారు.

Updated Date - 2020-10-04T09:39:01+05:30 IST