నడిరోడ్డుపై కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2020-07-08T16:12:57+05:30 IST
వాహనాలు బురద, మట్టిలోనో దిగబడడం చూశాం.. కానీ నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు దిగబడిపోయింది

నాగర్‌కర్నూల్ జిల్లా: వాహనాలు బురద, మట్టిలోనో దిగబడడం చూశాం.. కానీ నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు దిగబడిపోయింది. ముందుకు, వెనక్కు కదలలేక కాసేపు రోడ్డుపై ఆగిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా, తాడూరు మండలం, గుట్టలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్వకుర్తి డిపోకు చెందిన బస్సు తెల్కపల్లి వెళుతూ మార్గమధ్యలో రోడ్డుపై టైర్లు కూరుకుపోయాయి. దీంతో ప్రయాణీకులు కిందకు దిగాల్సి వచ్చింది. స్థానికులు వచ్చి రోడ్డును గడ్డపారతో తవ్వి బయటకు లాగారు. ఇప్పటికైనా సరైన రహదారులు వెయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.