ఆర్టీసీలో 50 శాతం మించిన వేతన కోతలు: ఈయూ

ABN , First Publish Date - 2020-06-11T09:40:47+05:30 IST

ఆర్టీసీలో 50 శాతం మించిన వేతన కోతలు: ఈయూ

ఆర్టీసీలో 50 శాతం మించిన వేతన కోతలు: ఈయూ

హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సిబ్బంది వేతనాల్లో కోతలు 50ు మించిపోయాయని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, కొన్ని డిపోల్లో వేతనాలు కేవలం 20-30ు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్‌లో ఒక విధానమంటూ లేకుండా పోయిందన్నారు. అవసరం లేకున్నా డ్రైవర్లు, కండక్టర్లను విధులకు రమ్మంటున్నారని చెప్పారు. కట్టడి ప్రాంతాల్లోని సిబ్బంది కూడా విధులకు రావాలంటూ వారిని డీఎంలు బెదిరిస్తున్నారని రాజిరెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-06-11T09:40:47+05:30 IST