కూంబింగ్‌లో అపశ్రుతి

ABN , First Publish Date - 2020-09-17T08:06:53+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన మావోయిస్టుల కూంబింగ్‌లో అపశ్రుతి జరిగింది. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఆర్‌ఎ్‌సఐ ఆదిత్య

కూంబింగ్‌లో అపశ్రుతి

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఎస్‌ఐ మృతి

భద్రాద్రి జిల్లా చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో ఘటన


చర్ల, సెప్టెంబరు 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన మావోయిస్టుల కూంబింగ్‌లో అపశ్రుతి జరిగింది. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఆర్‌ఎ్‌సఐ ఆదిత్య సాయికుమార్‌(24) చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో అక్కడికక్కడే చనిపోయా రు. చర్ల మండలంలో మావోయిస్టుల సంచారం అధికంగా ఉండడంతో ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ ప్రారంభించాయి. బుల్లెట్‌ ఆదిత్య శరీరంలోకి బలంగా దూసుకెళ్లిందని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. భద్రాచలంలో పంచనామా నిర్వహించి హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఆయన సొంత ఇంటికి తరలించారు. అప్పటివరకు తమతో ఉన్న మిత్రుడు ప్రాణాలు కోల్పోవడంతో బృందంలోని సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఆదిత్య అంకితభావంతో పనిచేయడంతో పాటు, ఉత్తమ అధికారిగా పేరు సంపాదించారని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-17T08:06:53+05:30 IST