రూ.68,028.. ఇది తెలంగాణలోని వ్యవసాయ కుటుంబంపై రుణభారం: కేంద్రం

ABN , First Publish Date - 2020-03-04T09:37:07+05:30 IST

తెలంగాణలోని వ్యవసాయ కుటుంబాలు పెద్ద మొత్తంలోనే రుణభారాన్ని మోస్తున్నాయి. సగటున ఒక్కో వ్యవసాయ కుటుంబంపై రూ.68,028 రుణ భారం ఉందని కేంద్ర

రూ.68,028.. ఇది తెలంగాణలోని  వ్యవసాయ కుటుంబంపై రుణభారం: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని వ్యవసాయ కుటుంబాలు పెద్ద మొత్తంలోనే రుణభారాన్ని మోస్తున్నాయి. సగటున ఒక్కో వ్యవసాయ కుటుంబంపై రూ.68,028 రుణ భారం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో టీఎంసీ ఎంపీ అధికారి దీపక్‌ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

Updated Date - 2020-03-04T09:37:07+05:30 IST