ఆపత్కాలంలోనూ రూ.5 భోజనం
ABN , First Publish Date - 2020-03-25T09:28:40+05:30 IST
విపత్కర పరిస్థితుల్లోనూ హైదరాబాద్ మహానగరంలోని అన్నార్థులను రూ.5కే అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఆదుకుంటున్నాయి. ఆదివారం జనతా కర్ఫ్యూ, మరునాటి

హైదరాబాద్ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : విపత్కర పరిస్థితుల్లోనూ హైదరాబాద్ మహానగరంలోని అన్నార్థులను రూ.5కే అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఆదుకుంటున్నాయి. ఆదివారం జనతా కర్ఫ్యూ, మరునాటి నుంచి లాక్‌డౌన్ ప్రకటించడంతో అత్యవసర సేవలు మినహా మిగతా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. హోటళ్లు, రోడ్ల పక్కన ఆహార విక్రయ సంస్థలూ అందుబాటులో లేవు. దీనిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం రూ.5 భోజన కేంద్రాలను కొనసాగించాలని ఆదేశించింది.