నరేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షలు మంజూరు

ABN , First Publish Date - 2020-09-06T08:55:36+05:30 IST

నరేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షలు మంజూరు

నరేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షలు మంజూరు

కొవిడ్‌ విధులు నిర్వహిస్తూ మరణించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ నరేశ్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ మోమోను జారీ చేశారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను డాక్టర్‌ నరేశ్‌ కుటుంబానికి అందించాలని, ఇవి తమ అత్యవసర ఆదేశాలుగా పాటించి అమలు చేయాలని ఆ మోమోలో పేర్కొన్నారు. నరేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంపై ప్రభుత్వ వైద్యుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Updated Date - 2020-09-06T08:55:36+05:30 IST