జూపార్కులో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి

ABN , First Publish Date - 2020-07-05T22:10:42+05:30 IST

జూపార్కులో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి

జూపార్కులో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి

హైదరాబాద్‌: నెహ్రు జూపార్కులో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ కదంబ మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి జూపార్కులో 11 ఏళ్ల వయసున్న రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ కదంబ మృతి చనిపోయిందని నెహ్రు జూపార్క్ అధికారులు చెప్పారు. 2014లో కర్ణాటక మంగళూరు పార్కు నుంచి కదంబను తీసుకొచ్చినట్లు జూపార్కు సిబ్బంది పేర్కొన్నారు. రాయల్ బెంగాల్ టైగర్ మృతిపై జూపార్క్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2020-07-05T22:10:42+05:30 IST