వైద్యం కోసం వెళ్తే ప్రాణం తీశారు

ABN , First Publish Date - 2020-12-25T22:13:20+05:30 IST

జిల్లాలోని హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది.

వైద్యం కోసం వెళ్తే ప్రాణం తీశారు

వరంగల్: జిల్లాలోని హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణం తీసింది. బిల్లు చెల్లించలేదని దాదాపు గంటపాటు పేషేంట్‌ను అడ్మిట్ చేసుకోలేదు. కొన ఊపిరిలోనే ఉన్న రోగిని ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్‌లోనే వదిలి వెళ్లారు. దాంతో కొమురమ్మ అనే పేషేంట్ మృతిచెందింది. మృతురాలి బంధువులు ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నిచర్ ధ్వoసం చేశారు. బంధువుల ఆందోళనతో రోహిణి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మృతిరాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-12-25T22:13:20+05:30 IST