అంత్యక్రియలకు వెళ్లొచ్చేసరికి.. ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2020-09-03T12:18:08+05:30 IST
బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఊరెళ్లి తిరిగొచ్చేలోపు

హైదరాబాద్/హైదర్‌నగర్ : బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఊరెళ్లి తిరిగొచ్చేలోపు కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లోని ఓ ఇంటి తాళం బద్దలుకొట్టి నగలు, నగదు దోచుకెళ్లిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. గత నెల 16న తమ వదిన చనిపోయిందని తెలుకున్న వీరవల్లి చంద్రనారాయణ ఇంటికి తాళం వేసి భార్యతో పాటు భీమవరం వెళ్లారు. 29న తిరిగొచ్చిన వారికి ఇంటి తాళం పగిలిపోయి ఉండటంతో లోపలికెళ్లి చూశారు. బీరువాలో బంగారు పుస్తెల తాడు, గొలుసు, చెవి కమ్మలు నగదు పోయిందని గుర్తించారు. ఈ మేరకు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.