ఆన్‌లైన్ ఆడిట్‌కు మార్గద ర్శి తెలంగాణ: కేంద్రం
ABN , First Publish Date - 2020-10-21T10:07:45+05:30 IST
తెలంగాణ స్ఫూర్తిగా వచ్చే ఏడాది దేశంలోని అన్ని పంచాయతీల్లోనూ ఆన్‌లైన్ ఆడిట్ చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ.

హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్ఫూర్తిగా వచ్చే ఏడాది దేశంలోని అన్ని పంచాయతీల్లోనూ ఆన్‌లైన్ ఆడిట్ చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ కార్యదర్శి కేఎస్ సేథి తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృవృద్ధి శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా, లోకల్ ఆడిట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావుకు లేఖ రాశారు.