లారీని ఢీకొన్న అంబులెన్స్...రోగి మృతి

ABN , First Publish Date - 2020-04-26T15:13:51+05:30 IST

లారీని ఢీకొన్న అంబులెన్స్...రోగి మృతి

లారీని ఢీకొన్న అంబులెన్స్...రోగి మృతి

కామారెడ్డి: కామారెడ్డి మండలం ఉగ్రవాయిగ్రామ స్టేజీ వద్ద ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి చెందిన అంబులెన్స్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. రోగిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-04-26T15:13:51+05:30 IST