అంబులెన్స్‌ను ఢీకొన్న బొలేరో.. డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2020-04-26T09:33:51+05:30 IST
రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుల కోసం వచ్చిన అంబులెన్స్‌ను శుక్రవారం అర్ధరాత్రి మరో వాహనం ఢీకొనడంతో ..

చేగుంట, ఏప్రిల్ 25: రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుల కోసం వచ్చిన అంబులెన్స్‌ను శుక్రవారం అర్ధరాత్రి మరో వాహనం ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూర్ శివారులో ఓ పాల వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులకు చికిత్స చేస్తున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం అతివేగంగా వచ్చి అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ వడ్ల ప్రశాంత్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు.