వైద్యం కోసం వస్తే.. కాటేసిన విధి
ABN , First Publish Date - 2020-12-16T04:44:32+05:30 IST
తిమ్మంపేటకు చెందిన గ్రామీణ ప్రైవేట్ వైద్యుడు రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.
రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఎంపీ దుర్మరణం
దుగ్గొండి. డిసెంబరు 15: తిమ్మంపేటకు చెందిన గ్రామీణ ప్రైవేట్ వైద్యుడు రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం. బోగోజు దేవేందర్(58) ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తె వైద్య పరీక్షల నిమిత్తం హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పతికి కోసం వెళ్లాడు. పోస్టల్‌కాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా క్రేన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.