ప్రమాదంలో అక్కా చెల్లెళ్ల దుర్మరణం.. నుజ్జయిన శరీరాలు

ABN , First Publish Date - 2020-12-11T12:21:45+05:30 IST

రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్లు దుర్మరణం చెందారు.

ప్రమాదంలో అక్కా చెల్లెళ్ల దుర్మరణం.. నుజ్జయిన శరీరాలు

హైదరాబాద్/మనోహరాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెళ్లు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం మజీద్‌పల్లికి చెందిన గడప కిష్టయ్య నీలమ్మకు ఒక కొడుకు, సత్తమ్మ, భాగమ్మ, మంగమ్మ, పుష్ప నలుగురు కుమార్తెలు. వారిలో సత్తమ్మ, భాగ్యమ్మ(44) కుటుంబాలు హైదరాబాద్‌లోని హస్మాన్‌పేటలో నివాసముంటుండగా, మజీద్‌పల్లిలో మంగమ్మ కుటుంబ,  పుష్ప (42) కుటుంబం నల్లగుట్టలో నివాసముంటోంది.


మంగమ్మ మామ శంకరయ్య సంవత్సరం క్రితం చనిపోవడంతో గురువారం ఏడాది దినం నిర్వహించతలపెట్టారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు భాగ్యమ్మ, పుష్ప.. ఆమె భర్త మల్లే్‌‌ష్ స్కూటీపై మజీద్‌పల్లికి బయల్దేరారు. మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి వద్ద ఐటీసీ పరిశ్రమ ముందు జాతీయరహదారిపై వెళ్తుండగా, హైదరాబాద్‌ నుంచి వచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న మల్లేష్‌ ఎగిరిపడడంతో భాగ్యమ్మ, పుష్ప రోడ్డుపై పడిపోయారు. దీంలో లారీ టైర్లు వీరిద్దరి పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనలో అక్కా చెల్లెళ్లు ఇద్దరి శరీరాలు నుజ్జు నుజ్జయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మల్లే్‌షను తూప్రాన్‌ ఆస్పత్రికి తరలించారు. మనోహరాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ లారీతో  పరారయ్యేందుకు  ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని, లారీని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2020-12-11T12:21:45+05:30 IST