చికిత్స కోసం వెళ్తూ..కారు బోల్తాపడి నలుగురి దుర్మరణం
ABN , First Publish Date - 2020-12-10T08:27:22+05:30 IST
విరిగిన కాలికి చికిత్స కోసం కర్ణాటకలోని రాయచూర్‌కు బయల్దేరిన ఆ కుటుంబానికి అదే చివరి ప్రయాణమైంది. అతివేగంతో వెళ్తున్న కారు పల్టీలు కొట్టడంతో ఆరుగురు కుటుంబ సభ్యుల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా.. మూడున్నరేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. హైదరాబాద్‌లోని

మూడున్నరేళ్ల బాలుడు మృత్యుంజయుడు
సరూర్‌నగర్/మక్తల్ రూరల్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): విరిగిన కాలికి చికిత్స కోసం కర్ణాటకలోని రాయచూర్‌కు బయల్దేరిన ఆ కుటుంబానికి అదే చివరి ప్రయాణమైంది. అతివేగంతో వెళ్తున్న కారు పల్టీలు కొట్టడంతో ఆరుగురు కుటుంబ సభ్యుల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా.. మూడున్నరేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌లో నివసిస్తున్న గోవిందమ్మ(50) కాలు ఓ ప్రమాదంలో విరిగింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స కోసం బుధవారం రాయచూర్‌కు బయల్దేరింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. దీంతో గోవిందమ్మ, ఆమె సోదరి శారద(55), భర్త ఎల్లయ్య(55),కుమార్తె హారిక(22) అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న గోవిందమ్మ కుమారుడు వినోద్(26) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడున్నరేళ్ల చిన్నారి చార్విక్ ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడంతో బడంగ్‌పేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.