రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు

ABN , First Publish Date - 2020-12-16T03:30:36+05:30 IST

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జనవరి తొమ్మిది నుంచి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణా తరగతులకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. అభ్యర్థి కనీస వయసు 17 సంవత్సరాలు లేదా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. శిక్షణకు సంబంధించిన పుస్తకాలు అభ్యర్ధులకు పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఇతర సందేహాలకు 040- 27635545, ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని రామకృష్ణ మఠం లాంగ్వేజెస్ విభాగం తెలిపింది. అభ్యర్థులు http://rkmathadmissions.winnou.net లింక్ ద్వారా అడ్మిషన్ పొందాలని సూచించింది. స్పోకెన్ ఇంగ్లీష్‌తో పాటు స్పోకెన్ సంస్కృతం, హిందీ, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, చైనీస్ భాషలు కూడా నేర్పిస్తారు. విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రామకృష్ణ మఠం లాంగ్వేజెస్ విభాగం సూచించింది.

Updated Date - 2020-12-16T03:30:36+05:30 IST