ఉప్పొంగుతున్న కృష్ణమ్మ

ABN , First Publish Date - 2020-09-20T07:31:09+05:30 IST

పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. శ్రీశైలం జలాశయానికి శనివారం 2,64,791 క్యూసెక్కుల

ఉప్పొంగుతున్న కృష్ణమ్మ

జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరదపోటు

శ్రీరామసాగర్‌కు కొనసాగుతున్న ప్రవాహం

సింగూరు ప్రాజెక్టుకు జలకళ

రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలే

 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది.   శ్రీశైలం జలాశయానికి శనివారం 2,64,791 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తారు. 4,60,798 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌ 20 గేట్లను ఎత్తి 3,40,344 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.04టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.80 అడుగుల (311.44 టీఎంసీలుగా) మేర నీరు ఉంది. 


శ్రీశైలం నీటి మట్టం 884.50 అడుగులుగా ఉంది. ఇది 212.9198 టీఎంసీలకు సమానం. గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 1,73,373 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 21,873 క్యూసెక్కుల నీటితో జూరాల జల విద్యుత్తు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు.

శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి, మంజీర నదుల ద్వారా 1.47 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 32 గేట్లను ఎత్తి 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  


Updated Date - 2020-09-20T07:31:09+05:30 IST