రిజర్వాయర్‌ను పరిశీలించిన సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌

ABN , First Publish Date - 2020-12-18T05:22:41+05:30 IST

రిజర్వాయర్‌ను పరిశీలించిన సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌

రిజర్వాయర్‌ను పరిశీలించిన సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌
నవాబుపేట రిజర్వాయర్‌ వివరాలను తెలుసుకుంటున్న అధికారులు

లింగాలఘణపురం డిసెంబరు 17 : లింగాలఘణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్‌ను గురువారం సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌ సామర్ధ్యం, ప్రస్తుతం ఉన్న నీటిమట్టం, ఇప్పటికే గేట్ల ద్వారా వెళ్లిన నీటితో నిండిన చెరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్‌ను పరిశీలించిన వారిలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రేఖారాణి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వీవీఎ్‌సఎన్‌ మూర్తి, ఈఈ విజయ్‌కుమార్‌, డీఈ వెంకటకృష్ణారావు, ఏఈ సునీల్‌కుమార్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ధనుంజయ్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-18T05:22:41+05:30 IST