హక్కులను కాలరాస్తున్నారు: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-05-18T08:52:15+05:30 IST
కార్మిక చట్టాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని టీపీసీసీ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, పేదలకు అండగా ఉండాలని, అన్నార్తులకు సాయం అందించాలని పీసీసీ

హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని టీపీసీసీ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, పేదలకు అండగా ఉండాలని, అన్నార్తులకు సాయం అందించాలని పీసీసీ నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం టీపీసీసీ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ వీడియో కాన్ఫరెన్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ ఖుంటియా మాట్లాడారు. లాక్‌డౌన్‌తో కష్టాలు పడుతున్న పేదలకు మరింత అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపడానికి వాహనాలు ఏర్పాటు చేయాలని, స్థానికంగా ఉన్నవారికి భోజన వసతి కల్పించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తొలగించి పని కాలాన్ని పెంచాలని చూస్తుందని, ఇది కార్మికుల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. ఈ విషయంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్రం ఆర్థిక పునరుద్ధరణకు ప్రకటించిన రూ.20 లక్షల కోట్లు పేదలకు ఉపయోగపడవని విమర్శించారు.