ఈ-పాస్‌ సిస్టమ్‌లోనే బియ్యం

ABN , First Publish Date - 2020-03-25T09:02:23+05:30 IST

కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యాన్ని ‘ఈ- పాస్‌’ సిస్టమ్‌ ద్వారానే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌

ఈ-పాస్‌ సిస్టమ్‌లోనే బియ్యం

కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యాన్ని ‘ఈ- పాస్‌’ సిస్టమ్‌ ద్వారానే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఈ-పాస్‌’ బయోమెట్రిక్‌ ఆన్‌లైన్‌ సిస్ట మ్‌ ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం 6 కిలోలు ఇస్తుండగా... ఏప్రిల్‌ కోటా కింద 12 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించిన విషయం విదితమే! ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసి ఏప్రిల్‌ కోటాకు 12 కిలోలకు పెంచాలని కమిషనర్‌ పేర్కొన్నారు.

Read more