సింగరేణిలో రక్షణ చర్యలపై సమీక్షించండి

ABN , First Publish Date - 2020-06-06T08:57:19+05:30 IST

సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని గనుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలపై పునఃసమీక్ష నిర్వహించాలని ..

సింగరేణిలో రక్షణ చర్యలపై సమీక్షించండి

అలసత్వం వహిస్తే కఠిన చర్యలు : సీఎండీ  ఎన్‌.శ్రీధర్‌


కొత్తగూడెం/హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని గనుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలపై పునఃసమీక్ష నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు. తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి శుక్రవారం ఆయన అన్ని ఏరియాల జీఎంలతో డైరెక్టర్లు, అడ్వయిజర్లతో నెలవారీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్‌-19తో రెండు నెలల కాలంలో వెనుకబడిన బొగ్గు ఉత్పత్తిని జూన్‌లో భర్తీ చేసుకోవాలన్నారు. కొత్త ఓపెన్‌ కాస్ట్‌ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి త్వరగా ప్రారంభించాలని, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. 

Updated Date - 2020-06-06T08:57:19+05:30 IST